ప్రభుత్వ స్థలం కబ్జా యత్నం

ABN , First Publish Date - 2022-12-06T23:26:03+05:30 IST

ఒకవైపు అధికారులు కబ్జాలపై ఉక్కు పాదం మోపుతున్నా కబ్జాదారులు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఒకచోట ప్రభుత్వం కబ్జా భూమిని స్వాధీనం చేసుకుంటే మ రోచోట కబ్జాల పర్వం సాగుతూనే ఉంది.

ప్రభుత్వ స్థలం కబ్జా యత్నం

రూ.కోట్ల విలువైన భూమి చదును

నందలూరు, డిసెంబరు 6: ఒకవైపు అధికారులు కబ్జాలపై ఉక్కు పాదం మోపుతున్నా కబ్జాదారులు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఒకచోట ప్రభుత్వం కబ్జా భూమిని స్వాధీనం చేసుకుంటే మ రోచోట కబ్జాల పర్వం సాగుతూనే ఉంది. ఇటీవల నందలూరులో కబ్జాలపై కలెక్టర్‌ సీరియస్‌ అయి కబ్జా భూములను అధికారులతో సర్వే చేయించి స్వాధీనం చేసుకున్నారు. ఇది మరవకముందే మళ్లీ విలువైన భూమి కబ్జాపరుల పాలవుతోంది. వివరాలిలా ఉన్నాయి. కడప-చెన్నై ప్రధాన రహదారిలోని నందలూరు నుంచి రాజంపేటకు వెళ్లే రహదారికి ఆనుకుని ఉన్న దాదాపు ఒకటిన్నర కోటికి పై గా విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఒక ప్రముఖ వ్యక్తి పాగా వేశారు.

నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీలోని 11 సెంట్లు ప్రభుత్వ గయాల భూమి (వ్యవసాయానికి పనికిరాని భూమి)ని కబ్జా చేసేందుకు ఆ వ్యక్తి మట్టిని తోలి చదును చేసే పనులకు శ్రీకారం చుట్టాడు. ఈ భూమి కబ్జాపరుల కాకుండా కా పాడి ప్రజలకు ఉపయోగపడే పనులకు ఉపయోగించేలా చూడా లని స్థానికులు కోరుతున్నారు. మరి అధికారులు ఎటువంటి చర్య లు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

ప్రభుత్వ స్థలాలను కాపాడతాం

ప్రభుత్వ స్థలాలను రక్షించేందుకు మా వంతు ప్రయత్నాలు మొ దలు పెట్టాం. కబ్జా చేసేందుకు ప్రయత్నించిన స్థలాన్ని మండల సర్వేయరు, వీఆర్వోతో కలిసి సర్వే చేయించి స్వాధీనం చేసుకుని ఆది ప్రభుత్వ స్థలమని సూచిక బోర్డును ఏర్పాటు చేస్తాము.

-ఉదయశంకర్‌రాజు, తహసీల్దార్‌, నందలూరు

Updated Date - 2022-12-06T23:26:05+05:30 IST