అమ్మ్టఒడి ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులకు అవసరమా..?..ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-03-06T04:51:58+05:30 IST

ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం అవసరమా? అంటూ దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తామని శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామి రెడ్డి పేర్కొన్నారు.

అమ్మ్టఒడి ప్రైవేట్‌ పాఠశాల   విద్యార్థులకు అవసరమా..?..ఎమ్మెల్యే

మైదుకూరు, మార్చి 5 : ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం అవసరమా? అంటూ దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తామని  శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామి రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మండల కార్యాలయంలో శనివారం  మండలపరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో చది వించే వారంతా ధనవంతులని, అలాగే ఇన్‌కంటాక్స్‌ కట్టే వారు కూడా  అమ్మఒడి అవసరం లేదని, ఇది నా అభిప్రాయమని అయినా దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తానంటూ వాఖ్యలు చేశారు.   సమావేశంలో తహసీల్దారు ప్రేమంతకుమార్‌, ఎంపీడీవో కుళా యమ్మ, జడ్పీటీసీ ప్రసన్నలక్ష్మి, వైస్‌ ఎంపీపీ చిన్న కొండమ్మ,  ఊటూరు రఘురామిరెడ్డి  ఎంపీటీసీ, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 


Read more