టీడీపీ అధినేతను కలిసిన అమర్‌నాథరెడ్డి
ABN , First Publish Date - 2022-01-07T04:53:34+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాటి అమర్‌నాథరెడ్డి కలిశారు.
చక్రాయపేట, జనవరి 6: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాటి అమర్‌నాథరెడ్డి కలిశారు. హార్టికల్చర్ మాజీ డైరెక్టర్ కర్ణాటి నాగభూషణంరెడ్డితో కలి సి తనను తెలుగు యువత రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా ఎంపిక చేసినందు కు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోనమ్మకంగా ఈ పదవి ఇచ్చారని కార్యకర్తల వెంట ఉంటూ తెలుగు దేశం పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తానని అమర్‌నాథరెడ్డి తెలిపారు. ప్రతి ఓటర్‌ను కలిసి పార్టీ చేసిన సేవలను తెలియజేస్తానని తెలిపారు. చంద్రబాబునాయుడు కష్టపడేవారికే పదవులు ఇస్తున్నారని తెలిపారు.