గడువులోపు అభివృద్ధి పనులన్నీ పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-09-28T04:59:33+05:30 IST

పులివెందులలో జరుగుతున్న మోడల్‌ టౌన్‌, ఇతర పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. పులివెందుల మోడల్‌ టౌన్‌కు సంబంధించి రూ.613.33 కోట్లతో జరుగుతున్న 28 రకాల పనుల పురోగతిపై మంగళవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

గడువులోపు అభివృద్ధి పనులన్నీ పూర్తిచేయాలి
ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు

సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ విజయరామరాజు

పులివెందులటౌన్‌, సెప్టెంబరు 27: పులివెందులలో జరుగుతున్న మోడల్‌ టౌన్‌, ఇతర పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. పులివెందుల మోడల్‌ టౌన్‌కు సంబంధించి రూ.613.33 కోట్లతో జరుగుతున్న 28 రకాల పనుల పురోగతిపై మంగళవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల మోడల్‌ టౌన్‌కు సంబంధించి జరుగుతున్న పనుల్లో వేగాన్ని పెంచాలని, అలాగే ప్రతిరోజూ పనులను పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. పనుల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అధికారులు నగరవనం, ఉలిమెల్ల చెరువు, రాయలాపురం బ్రిడ్జి, వంక పనులు, సిటీ సెంటర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ తదితర పనుల వివరాలను కలెక్టర్‌కు ప్రొజెక్టర్‌ ద్వారా చూపించారు. అనంతరం 14 ఎకరాలలో దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో జరుగుతున్న క్రికెట్‌ స్టేడియం పనులను, రూ.36 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో వెంకటేశ్‌, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read more