-
-
Home » Andhra Pradesh » Kadapa » Agitation in front of police station for justice-MRGS-AndhraPradesh
-
న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన
ABN , First Publish Date - 2022-09-12T05:19:18+05:30 IST
న్యా యం కోరుతూ పోలీస్‌స్టేషన్‌కు వెళితే అక్కడి సిబ్బంది పట్టించుకోకుండా బయటకు వెళ్లమన్నారని బాధితులు ఆరోపిస్తూ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

మదనపల్లె క్రైం, సెప్టెంబరు 11: న్యా యం కోరుతూ పోలీస్‌స్టేషన్‌కు వెళితే అక్కడి సిబ్బంది పట్టించుకోకుండా బయటకు వెళ్లమన్నారని బాధితులు ఆరోపిస్తూ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సంఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. బాధితుల కథ నం మేరకు..మదనపల్లె మండలం డ్రైవర్స్ కాలనీకి చెందిన ప్రసన్నకుమార్(22) రెం డు రోజుల కిందట మదనపల్లె పట్టణంలో ఓ వ్యక్తి బుల్లెట్‌తో ఢీకొనడంతో రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈక్రమంలో అదేరోజు వన్‌టౌన్ పోలీసులు కేసునమోదు చేశారు. అయితే పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, అతని వాహనాన్ని సీజ్ చేయ లేదని ప్రసన్నకుమార్ కుటుంబీకులు ఆరోపిస్తూ న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అక్కడి సిబ్బంది న్యాయం చేయకుండా బయటకు వెళ్లండంటూ దబాయిం చారని బాధితులు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన రోజే కేసునమోదు చేసి బాధితులకు ఎఫ్‌ఐఆర్ కాఫీ ఇచ్చామన్నారు. అయితే నిందితుడితో పంచాయితీ చేసి డబ్బులు ఇప్పించాలని బాధితు లు కోరడంతో ఆ పని మావల్ల కాదని..ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోమని చెప్పి పంపించామన్నారు. దీంతో వారు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారని సీఐ ఈదురుబాషా చెప్పారు. బాధితులకు కోర్టులోనే న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది.