అసౌకర్యాల అడ్డా.. బాయ్స్‌ హాస్టల్‌

ABN , First Publish Date - 2022-09-11T04:48:36+05:30 IST

ప్రభుత్వం అందరికీ నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా సాంఘిక సంక్షేమ విద్యాలయాలు పేదలకోసం హాస్టల్స్‌ను ప్రవేశపెట్టింది. అయితే కాంట్రాక్టర్లు, అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి నాణ్యతాపరమైన నిర్మాణాలు చేపట్టకపోవడంతో 15 ఏళ్ల కిందట నిర్మించిన బాయ్స్‌ హాస్టల్‌ అసౌకర్యాలకు అడ్డాగా మారింది.

అసౌకర్యాల అడ్డా.. బాయ్స్‌ హాస్టల్‌
హాస్టల్‌ ప్రాంగణంలో ఉన్న పిచ్చిమొక్కలు, కంపచెట్లు

పెచ్చులూడుతోన్న వసతిగృహం

ప్రాంగణమంతా కంపచెట్లు

చిన్నమండెం, సెప్టెంబరు 10: ప్రభుత్వం అందరికీ నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా సాంఘిక సంక్షేమ విద్యాలయాలు పేదలకోసం హాస్టల్స్‌ను ప్రవేశపెట్టింది. అయితే కాంట్రాక్టర్లు, అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి నాణ్యతాపరమైన నిర్మాణాలు చేపట్టకపోవడంతో 15 ఏళ్ల కిందట నిర్మించిన బాయ్స్‌ హాస్టల్‌ అసౌకర్యాలకు అడ్డాగా మారింది. 

చిన్నమండెం బాయ్స్‌ హాస్టల్‌లో గత సంవత్సరం దాదాపు 70 మంది విద్యార్థులు ఉండేవారు. కానీ ఇక్కడి హాస్టల్‌ శిథిలావస్థకు చేరడం, బాత్‌రూంలు పెచ్చులూడి కాంక్రీట్‌ కడ్డీలు దర్శనమివ్వడంతో విద్యార్థులు భయాందోళ నకు గురవుతున్నారు. దీనికి తోడు బాత్‌రూమ్‌ డోర్‌లు లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టల్‌ ప్రాంగణమంతా పిచ్చిమొక్కలు, కంపచెట్లు దర్శనమిస్తున్నాయి. హాస్టల్‌కు ప్రత్యేకంగా వేయించిన బోరు చెడిపోవడంతో తాగునీరు, ఇతర అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు. 

Read more