తుఫానుతో దె బ్బతిన్న పంటలను పరిశీలించిన ఏడీఏ

ABN , First Publish Date - 2022-12-16T00:08:26+05:30 IST

మండల వ్యాప్తంగా ఇటీవల మాండస్‌ తుఫానుతో దెబ్బతిన్న పంటలను గురువారం ఏడీఏ సుబ్బారావు మండల వ్యవసాయాధికారి శ్రీదేవి పరిశీలించారు.

తుఫానుతో దె బ్బతిన్న పంటలను పరిశీలించిన ఏడీఏ

చెన్నూరు, డిసెంబరు 15 : మండల వ్యాప్తంగా ఇటీవల మాండస్‌ తుఫానుతో దెబ్బతిన్న పంటలను గురువారం ఏడీఏ సుబ్బారావు మండల వ్యవసాయాధికారి శ్రీదేవి పరిశీలించారు. ఉప్పరపల్లె, దుగ్గనపల్లె గ్రామాల్లోసాగులో ఉన్న శనగ, మినుము, పత్తి, వరిపంటలను పరిశీలించి ఆ పంటల్లో రాబోవు రోజుల్లో ఎలాంటి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మందుల గురించి వివరించారు. కార్యక్రమంలో గ్రామవ్యవసాయ సహాయకులు సలోమి, సునీలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:08:30+05:30 IST