ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2022-03-05T05:12:00+05:30 IST

పట్ట ణంలో ట్రాఫిక్‌కు ఇ బ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని సీఐ ర మే్‌షబాబు ప్రజలను హెచ్చరిం చారు.

ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు
పోరుమామిళ్లలో ట్రాఫిక్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సీఐ రమే్‌షబాబు

పోరుమామిళ్ల, మార్చి 4:పట్ట ణంలో ట్రాఫిక్‌కు ఇ బ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని సీఐ ర మే్‌షబాబు ప్రజలను హెచ్చరిం చారు. శుక్రవారం పోరుమామిళ్లలోని వైజంక్షన్‌, ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాల్లో సీఐ ఆధ్వర్యంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అక్క డి ప్రజలతో, వ్యాపారులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని, రద్దీగా ఉన్న ప్రాంతాలలో నియమాలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ హరిప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు. 


Read more