నకిలీ పట్టాలు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-14T04:50:57+05:30 IST

పోరుమామిళ్ల మండలంలో ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలను అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి భైరవ ప్రసాద్‌ పేర్కొన్నారు.

నకిలీ పట్టాలు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలి

పోరుమామిళ్ల, సెప్టెంబరు 13 : పోరుమామిళ్ల మండలంలో ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలను అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి భైరవ ప్రసాద్‌ పేర్కొన్నారు. మంగళవారం పోరుమామిళ్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగసముద్రం పంచాయతీ పరిధిలోని 1263 సర్వే నెంబర్‌లో నకిలీ పట్టాలు సృష్టించి అమ్మకాలు జరుపుతున్నారని వారి పై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే 1271, 1272, 1273, 1274 సర్వే నెంబర్లలో కూడా నకిలీపట్టాలు తయారు చేస్తున్నారని వీటి పై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు గౌసియాబేగం, వరలక్ష్మి, శ్రీనివాసులు, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

Read more