ఓటుకు ఆధార్‌ అనుసంధానం చేయాలి

ABN , First Publish Date - 2022-08-05T04:48:56+05:30 IST

ఓటరు జాబితా డేటాను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయాలని కడప రెవె న్యూ డివిజనల్‌ అధికారి ధర్మచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

ఓటుకు ఆధార్‌ అనుసంధానం చేయాలి

కడప(కలెక్టరేట్‌), ఆగస్టు 4: ఓటరు జాబితా డేటాను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయాలని కడప రెవె న్యూ డివిజనల్‌ అధికారి ధర్మచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కళా క్షేత్రంలో ఓటు కు ఆధార్‌ కార్డు అనుసంధానం ప్రక్రియపై బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లతో   ఆర్డీఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1వ తేదీ నుంచి ఓటుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రతి బీఎల్‌ఓ ఇంటింటికీ వెళ్లి ఫారం 6బీ ద్వారా  ఆధార్‌ కార్డు అను సంధానం చేయాలన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఆధార్‌ లింక్‌ చేసే ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత బీఎల్‌ ఓలదే అన్నారు.

Updated Date - 2022-08-05T04:48:56+05:30 IST