రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ABN , First Publish Date - 2022-09-14T04:36:08+05:30 IST

రోడు ్డప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
పరమేష్‌ మృతదేహం

మదనపల్లె క్రైం, సెప్టెంబరు 13: రోడు ్డప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. పుంగ నూ రు మండలం మంగళం పంచాయతీ చెలిమి గడ్డకు చెందిన పరమేష్‌(26), ఇతని స్నేహి తుడు గణపతి(30)లు కూలిపనులు చేస్తుం టారు. మంగళవారం ద్విచక్రవాహనంలో కలికిరి మండలం గుండ్లూరుకు వెళుతుండగా వాల్మీకి పురం మండలం జర్రావారిపల్లె మలుపు వద్ద వీరి వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా, పరమేష్‌ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారిం చారు. గాయపడిన గణపతికి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న వాల్మీకి పురం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. అనంతరం పర మేష్‌ కుటుంబీకులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు కేసునమోదు చేసినట్లు వారు చెప్పారు.


Read more