ఓ మోస్తరు వర్షం

ABN , First Publish Date - 2022-07-06T05:43:03+05:30 IST

కడప నగరంలో మంగళవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో మధ్యాహ్నం చిరుజల్లులు కురిశాయి. అప్పటి నుంచి ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం 3.30 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. రెండున్నర గంటల పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి.

ఓ మోస్తరు వర్షం
క్యారేజీ బుట్టలు టోపీలుగా.. రైటింగ్‌ ప్యాడ్‌ గొడుగుగా..

నగరం జలమయం

కడప(ఎర్రముక్కపల్లి), జూలై 5: కడప నగరంలో మంగళవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో మధ్యాహ్నం చిరుజల్లులు కురిశాయి. అప్పటి నుంచి ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం 3.30 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. రెండున్నర గంటల పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌, ఆర్టీసీ ఆర్‌ఎం ఆఫీస్‌, జిల్లా కోర్టు తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. చిరు వ్యాపారులు, పాదచారులు, వాహనఛోదకులు అసౌకర్యానికి గురయ్యారు.              Updated Date - 2022-07-06T05:43:03+05:30 IST