నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

ABN , First Publish Date - 2022-08-26T05:21:19+05:30 IST

పట్టణంలోని బైపాస్‌ రోడ్డుకు సమీపంలో ఉన్న లక్ష్మీనగర్‌లో గురువారం నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.

నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి
నీటి తొట్టిలో పడి మృతి చెందిన గంగోత్రి

రైల్వేకోడూరు, ఆగస్టు 25: పట్టణంలోని బైపాస్‌ రోడ్డుకు సమీపంలో ఉన్న లక్ష్మీనగర్‌లో గురువారం నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. బంధువుల కథనం మేరకు...సుంకమ్మ, నాగులయ్య అనే భార్య భర్తలు గ్యాస్‌ పొయ్యి రిపేర్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇందులో రెండో కుమార్తె గంగోత్రి (5) ఇంటికి సమీ పంలో ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడింది. విషయం తెలుసుకున్న బంధువులు సమీపం లోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే గంగోత్రి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. చిన్నారి గంగోత్రి మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. 

Read more