734 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2022-01-23T05:18:22+05:30 IST

జిల్లాలో కరోనా దూకుడు కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 734 మందిలో కరోనా పాజిటివ్‌ వైరస్‌ నిర్ధారణ అయింది.

734 పాజిటివ్‌ కేసులు నమోదు

కడప, జనవరి 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా దూకుడు కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 734 మందిలో కరోనా పాజిటివ్‌ వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,20,411కు చేరుకుంది. ఇప్పటి వరకు 715 మంది మృతి చెందారు. కోలుకున్న 308 మందిని డిశ్చార్‌ ్జ చేయగా రికవరీ సంఖ్య 1,19,510కు చేరుకుంది. ఆస్పత్రిలో 84 మంది, హోం ఐసోలేషన్‌లో 3120 మంది, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 16 మంది చికిత్స పొందుతున్నారు.


వీరబల్లి హైస్కూల్‌లో ఏడుగురికి పాజిటివ్‌

వీరబల్లి, జనవరి 22: వీరబల్లి హైస్కూల్‌లో ఏడుగురు సిబ్బందికి పాజిటివ్‌ నమోదైనట్లు వైద్యాధికారి ప్రదీ్‌పకుమార్‌ తెలిపారు. మండలంలో మొత్తం 22 మందికి పాజిటివ్‌ నమోదు కాగా హైస్కూల్‌లో ఐదుగురు ఉపాధ్యాయులు, ఇద్దరు వంట వారు ఉన్నారు. దీంతో పాఠశాలను మూసివేసేశారన్నారు. మండల వ్యాప్తంగా వీరబల్లిలో 14, సోమవరంలో 3, ఓదివీడులో 3, గడికోటలో 2 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారి సూచించారు.

Updated Date - 2022-01-23T05:18:22+05:30 IST