గొంతు నొక్కేందుకే ‘30 పోలీస్‌ యాక్టు’

ABN , First Publish Date - 2022-09-26T04:33:41+05:30 IST

సమస్యలపై పరిష్కారం కోరేందుకు ఎత్తిన గొంతును నొక్కేందుకే 30 పోలీసు యాక్టు వినియోగిస్తున్నారని భారత కమ్యూని స్టు పార్టీ నేతలు దుయ్యబట్టారు.

గొంతు నొక్కేందుకే ‘30 పోలీస్‌ యాక్టు’
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు జి.ఈశ్వరయ్య

జగన్‌ ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని ఎండగడటాం

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

ప్రొద్దుటూరు క్రైం, సెప్టెంబరు 25: సమస్యలపై పరిష్కారం కోరేందుకు ఎత్తిన గొంతును నొక్కేందుకే 30 పోలీసు యాక్టు వినియోగిస్తున్నారని భారత కమ్యూని స్టు పార్టీ నేతలు దుయ్యబట్టారు. రాష్ట్రంలో జగన్‌ పాలనలో ప్రతిపక్ష పార్టీలు,  ఉపాధ్యాయ ఉద్యోగులు, కార్మికులు చేపట్టే ఉద్యమాలను అడ్డుకోవడం సర్వసాధారణమైంది. వీరి గొంతు నొక్కేందుకే 30 పోలీసు యాక్టును అమలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై వక్తలు ధ్వజమెత్తారు.

ఆదివారం గీతాంజలి హైస్కూల్‌ ఆవరణలో సీపీఐ ఆధ్వర్యంలో పట్టణంలో 30 పోలీసు యాక్టు అమలుకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జిల్లా కార్యవర్గసభ్యులు బి.రామయ్య అధ్యక్షత వహించగా, వక్తలుగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు జి.ఈశ్వర య్య, మాజీ ఎమ్మెల్యే, కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట కుతుబుద్దీన్‌, టీడీపీ నేతలు ఖలీల్‌బాష, అలీబేగ్‌, విరసం రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మి, కాంగ్రెస్‌ నేత పీఎండీ నజీర్‌, ఎంపీటీ నేత సలీం, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత దస్తగిరి ఫైజా, ఇన్సాఫ్‌ నేత షరీఫ్‌, ఏఐవైఎఫ్‌ నేత నాగరాజు, ఎస్‌టీయూ నేత రషీద్‌ఖాన్‌, ఏఐబీఈఏ నేత సుధాకర్‌, జమాతేఇస్లామ్‌ నేత బాష మాట్లాడుతూ ఎవరికైనా నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. అయితే అధికార వైసీపీ నేతలు 30 పోలీసు యాక్టును తమ కు అనుకూలం చేసుకుని ఈ హక్కును కాలరాస్తున్నారన్నారు.

30 పోలీసు యాక్టుతో ప్రతిపక్షాలు, ప్రజల గొంతుక విప్పకుండా చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. ఈ యాక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జగన్‌ ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ జయంతి (అక్టోబరు 2)న గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి అన్ని పార్టీలు, సంఘాలతో రెండు గంటలు సత్యాగ్రహం చేయాలని తీర్మానించారు. దీనికి వ్యా పార సంఘాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన, ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన నేతలు శివకల్యాణ్‌రెడ్డి, ఏఐటీయూసీ నేతలు హరి మధు, యోసోబ్‌, శ్రీనివాసరెడ్డి శివారెడ్డి, లక్ష్మినారాయణ, చంద్రశేఖర్‌, నారాయణమూర్తి, మహిళా సమాఖ్య నాయకురాలు ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-26T04:33:41+05:30 IST