రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి

ABN , First Publish Date - 2022-03-06T04:56:19+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శి ఓరుగంటి నాగేంద్రబాబు డి మాండ్‌ చేశారు.

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి

కడప(ఎడ్యుకేషన్‌) మార్చి 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శి ఓరుగంటి నాగేంద్రబాబు డి మాండ్‌ చేశారు. కడపనగరంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2022- 23 సంవత్సరానికి సంబంధించిన ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో 30 శాతం విద్యారంగానికి నిధులు కేటాయించాలని కోరారు. ప్రొఫెసర్‌ కొఠారి కమీషన్‌ సూచనల మేరకు కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని సిఫారసు చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎక్కడ కూడా కేటాయించలేదన్నారు. సాంకేతిక విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలన్నారు. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పరిశ్రమలు నెలకొల్పి నిరుదోగ్యాన్ని రూపుమాపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పీడీఎ్‌సయూ నగర నాయకులు వెంకటేష్‌, సూర్యనాయక్‌, వినీత్‌, డానియల్‌, శుభకృష్ణ, ఇర్ఫాన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T04:56:19+05:30 IST