25 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ABN , First Publish Date - 2022-10-03T05:04:09+05:30 IST

పోరుమామిళ్ల రేంజ్‌ మల్లెపల్లె ఫారెస్టు చెక్‌పోస్టు పరిధి నిచ్చెండ్లులో 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్టు రేంజర్‌ వెంకట రమణారెడ్డి తెలిపారు.

25 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు

 పోరుమామిళ్ల,  అక్టోబరు 2: పోరుమామిళ్ల రేంజ్‌ మల్లెపల్లె ఫారెస్టు చెక్‌పోస్టు పరిధి నిచ్చెండ్లులో 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్టు రేంజర్‌ వెంకట రమణారెడ్డి తెలిపారు. అందిన సమాచారం మేరకు ఆదివారం మల్లెపల్లె ఫారెస్టు రేంజ్‌ పరిధిలో తనిఖీ చేపట్టగా అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 25 ఎర్రచందనం దుంగలు కంటపడ్డాయన్నారు. వీటిని స్వాధీనం చేసుకున్నామని నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. వీటి విలువ లక్ష 60 వేల రూ పాయలు ఉంటుందన్నారు. కార్యక్రమంలో అటవీ సిబ్బంది కృష్ణ, కృష్ణయ్య, ఎఫ్‌బీఓ వెకంటేశ్వర్లు, వీర ప్రతాప్‌, కిషోర్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Read more