సీబీఆర్ నుంచి 2400 క్యూసెక్కులు విడుదల
ABN , First Publish Date - 2022-10-08T05:01:18+05:30 IST
మండలంలోని పార్నపల్లె వద్దగల చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) నుంచి 2400 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) ఈఈ రాజశేఖర్ తెలిపారు.
లింగాల, అక్టోబరు 7: మండలంలోని పార్నపల్లె వద్దగల చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) నుంచి 2400 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) ఈఈ రాజశేఖర్ తెలిపారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సీబీఆర్‌లోకి నీరు చేరుతోందన్నారు. దాదాపు 10రోజల నుంచి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో కొనసాగుతోందన్నారు. ప్రాజెక్టులోకి వచ్చే నీటిని యదాతథంగా కిందికి వదులుతున్నట్లు ఈఈ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.05 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ తెలిపారు.