80 మంది విద్యార్థులకు 11 మంది ఉపాధ్యాయులా?

ABN , First Publish Date - 2022-10-18T04:43:29+05:30 IST

గిరిజన గురుకుల పాఠశాలలో 80 మంది విద్యార్థులకు 11 మంది ఉపాధ్యాయులా అని గిరిజన గురుకుల పాఠశాల ప్రాజెక్టు డైరెక్టర్‌ (నెల్లూరు ఐటీడీఏ ఆఫీసర్‌ ) డాక్టర్‌ రాణి మందా ఆగ్రహం వ్యక్తం చేశారు.

80 మంది విద్యార్థులకు 11 మంది ఉపాధ్యాయులా?
గిరిజన గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ప్రాజెక్టు డైరెక్టర్‌ రాణిమందా

 విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత లేదా?

గిరిజన గురుకులాల పీడీ ఆగ్రహం

పోరుమామిళ్ల, అక్టోబరు 17: గిరిజన గురుకుల పాఠశాలలో 80 మంది విద్యార్థులకు 11 మంది ఉపాధ్యాయులా అని  గిరిజన గురుకుల పాఠశాల ప్రాజెక్టు డైరెక్టర్‌ (నెల్లూరు ఐటీడీఏ ఆఫీసర్‌ ) డాక్టర్‌ రాణి మందా ఆగ్రహం వ్యక్తం చేశారు.   సోమవారం పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచా యతీ పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశా రు. తరగతి గదులు. వంట గది,  స్నానాలగదులు, మరుగుదొడ్లు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవనాలు నిర్మించి, సదుపాయాలు కల్పించి 320 మంది విద్యార్థులు లక్ష్యంగా గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తే 80 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వీరికోసం  11 మంది ఉపాధ్యాయులు.. ఒక ప్రిన్సిపాల్‌, వార్డెన్‌ ఎందుకని ప్రశ్నించారు.  రూ.20లక్షల వ్యయంతో మరుగుదొడ్లు నిర్మిస్తే చాలా వాటికి డోర్లు లేకుండా పోయాయి, మెయింటెనెన్స్‌ చేసే విధానం ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. నెల్లూరులో 400 మంది విద్యార్థులు ఉండగా, ఇక్కడ మాత్రం కేవలం 80 మంది మాత్రమే ఉండడం సబబు కాదన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. ఎస్టీ కాలనీల్లో పర్యటించి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ శాంతకుమారి, డెవలప్‌మెంటు ఆఫీసర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రతినెలా వైద్య పరీక్షలు చేయించాలన్నారు. వైద్యశిబిరాలు నిర్వహిచాలన్నారు. 


Updated Date - 2022-10-18T04:43:29+05:30 IST