Rushikonda Issue: జగన్ అండ్ కో ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారు: చినరాజప్ప

ABN , First Publish Date - 2022-10-28T19:17:13+05:30 IST

ఉత్తరాంధ్ర పోరుబాటలో భాగంగా రుషికొండ (Rushikonda Issue) వద్ద నిరసనకు టీడీపీ (TDP) పిలుపునిచ్చింది.

Rushikonda Issue: జగన్ అండ్ కో ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారు: చినరాజప్ప
Nimmakayala Chinarajappa

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): ఉత్తరాంధ్ర పోరుబాటలో భాగంగా రుషికొండ (Rushikonda Issue) వద్ద నిరసనకు టీడీపీ (TDP) పిలుపునిచ్చింది. రుషికొండపై నిరసన తెలిపేందుకు వెళ్లేందుకు సిద్దమవుతున్న టీడీపీఎల్పీ నేత నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala Chinarajappa)ను కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసు చర్యలను నిరసిస్తూ రాజప్ప కార్యకర్తలతో కలిసి ఇంటి ముందు భైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సమస్యలపై టీడీపీ పోరుబాట కార్యక్రమాన్ని సీఎం జగన్ వైసీపీ మంత్రులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. జగన్ అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. పోరుబాటకు బయలుదేరుతున్న టీడీపీ నేతలు నిర్బంధించడాన్ని చినరాజప్ప తప్పుబట్టారు.

విశాఖలో రుషికొండ విధ్వంసానికి నిరసనగా టీడీపీ శుక్రవారం చేపట్టదలచిన ఆందోళన కార్యక్రమానికి నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నేతల భూ, వనరుల దోపిడీపై ఆరు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. అయితే, శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గీతం విశ్వవిద్యాలయానికి రానున్న నేపథ్యంలో టీడీపీ ఆందోళనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ద్వారకా ఏసీపీ ప్రకటించారు. శుక్రవారం రుషికొండపై నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఉమ్మ డి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయం వద్ద నిఘా పెట్టారు. నేతలను హౌస్‌ అరెస్టు చేశారు.

Updated Date - 2022-10-28T19:17:21+05:30 IST