పోస్టింగ్‌ ఇచ్చేవరకు అక్కడే పనిచేయండి

ABN , First Publish Date - 2022-12-15T03:34:02+05:30 IST

కొత్తగా డిప్యూటీ కలెక్టర్‌ పదోన్నతి పొందిన వారికి సర్కారు కీలకమైన సూచన చేసింది. సాధారణ పరిపాలన శాఖ పోస్టింగ్‌ ఇచ్చేవరకు ప్రస్తుతం పనిచేస్తున్న చోటే కొనసాగాలని ఆదేశిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పోస్టింగ్‌ ఇచ్చేవరకు అక్కడే పనిచేయండి

డిప్యూటీ కలెక్టర్‌ పదోన్నతి పొందినవారికి సర్కారు ఆదేశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కొత్తగా డిప్యూటీ కలెక్టర్‌ పదోన్నతి పొందిన వారికి సర్కారు కీలకమైన సూచన చేసింది. సాధారణ పరిపాలన శాఖ పోస్టింగ్‌ ఇచ్చేవరకు ప్రస్తుతం పనిచేస్తున్న చోటే కొనసాగాలని ఆదేశిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 66 మంది తహసీల్దార్లకు ఇటీవల డిప్యూటీ కలెక్టర్‌గా పద్నోనతులు కల్పించిన సంగతి తెలిసిందే. వారంతా వెంటనే ఇప్పుడున్న పోస్టుల నుంచి రిలీవ్‌ అయ్యి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని జీఓ 747లో రెవెన్యూశాఖ పేర్కొంది. అందరూ ఒకేసారి రిలీవ్‌ అయ్యే ప్రయత్నం చేయగా కొందరు కలెక్టర్లు అభ్యంతరం తెలిపారు. జీఏడీ పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఎలా రిలీవ్‌ అవుతారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఖాళీలు గుర్తించే పనిలో ఉన్నారు. ఖాళీల ఆధారంగా సాధారణ పరిపాలన శాఖ వారికి పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇస్తుంది. అప్పటి వరకు ప్రస్తుతం పనిచేస్తున్న చోటే కొనసాగాలంటూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సవరణ జీఓ 748 జారీ చేశారు.

Updated Date - 2022-12-15T03:34:04+05:30 IST