ఎంపీ గోరంట్ల వ్యవహారంలో ఎందుకీ మౌనం?: టీడీపీ

ABN , First Publish Date - 2022-08-14T21:28:02+05:30 IST

AP News: ఎంపీ గోరంట్ల వ్యవహారంలో ఎందుకీ మౌనం: టీడీపీ Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. తక్షణమే ఎంపీపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఎంపీ గోరంట్ల వ్యవహారంలో ఎందుకీ మౌనం?:  టీడీపీ

Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. తక్షణమే ఎంపీపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


గోరంట్ల వీడియోను పరిశీలించాక అందులో ఎలాంటి ఎడిటింగ్ జరగలేదని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ జిమ్స్ స్టెఫర్డ్ రిపోర్టు ఇచ్చింది. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక కూడా ఎంపీ మాధవ్‌పై ఎస్పీ ఫక్కీరప్ప ఎందుకు కేసు రిజిష్టర్ చేయలేదని, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా మౌనం వహించడంలో అర్థమేమిటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఓ వైపు దేశమంతా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటే.. ఏపీ రాష్ట్ర ప్రజలను ఎంపీ మాధవ్ నగ్న వీడియో వెంటాడుతోందని, మహిళలంతా సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించిన ఎంపీ మాధవ్‌‌‌కు రేపు స్వాతంత్య వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నాయకులు బరితెగించిన మాధవ్‌ను రక్షించడం కోసం పడుతున్న తపన హాస్యాస్పదంగా ఉందన్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా అనంతపురం  ఎస్పీ ఫక్కీరప్ప ఎంపీపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.  


Updated Date - 2022-08-14T21:28:02+05:30 IST