AP News: సత్తెనపల్లిలో విషాదం.. డ్రైనేజీలో పడి ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2022-08-21T13:13:05+05:30 IST

సత్తెనపల్లిలో విషాదం నెలకొంది. డ్రైనేజీలో పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు.

AP News: సత్తెనపల్లిలో విషాదం.. డ్రైనేజీలో పడి ముగ్గురు మృతి

పల్నాడు జిల్లా (Palnadu District): సత్తెనపల్లిలో విషాదం నెలకొంది. డ్రైనేజీలో పడి  ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇద్దరు కూలీలతో పాటు భవనం యజమాని మృతి చెందారు. బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న న్యూ వినాయక  రెస్టారెంట్‌లో డ్రైనేజ్‌ను శుభ్రపరిచేందుకు ఇద్దరు కూలీలు వచ్చారు. బిల్డింగ్ యజమాని దగ్గరుండి పనిచేయిస్తున్నారు. కూలీలు డ్రైనేజీ క్లీన్ చేస్తుండగా ఒక్క సారిగా ముగ్గురు గుంటలో పడి మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు కొండలరావు (60) అనిల్ (20) బ్రహ్మం (18)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.


Read more