వాస్తవాలనే నివేదికల్లో పెట్టాలి

ABN , First Publish Date - 2022-12-15T03:15:35+05:30 IST

అధికారులు పాఠశాలలను సం దర్శించి వాస్తవ పరిస్థితులను మాత్రమే నివేదికల్లో పొందుపరచాలని పాఠశాల విద్య కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ఆదేశించారు.

వాస్తవాలనే నివేదికల్లో పెట్టాలి

పాఠశాల విద్య కమిషనర్‌ సురేశ్‌కుమార్‌

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): అధికారులు పాఠశాలలను సం దర్శించి వాస్తవ పరిస్థితులను మాత్రమే నివేదికల్లో పొందుపరచాలని పాఠశాల విద్య కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ఆదేశించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై పాఠశాల విద్య ఆర్జేడీలు, డీఈవోలు, సమగ్రశిక్ష ఏపీసీలతో బుధవారం విజయవాడలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడి, విద్యాకానుక, నాడు-నేడు, గోరుముద్ద, పాఠ్యాంశ సం స్కరణలు.. అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు దోహదం చేస్తాయన్నారు. వాస్తవాలపై దృష్టిసారిస్తూ సరైన సమాచారంతోనే అభివృద్ధి సూచీ సాధన దిశగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

Updated Date - 2022-12-15T03:15:36+05:30 IST