అమర్నాథ్ యాత్రికుల బృందం క్షేమం
ABN , First Publish Date - 2022-07-10T19:30:45+05:30 IST
అమరావతి: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికుల బృందం క్షేమంగా ఉందని బృంద నిర్వాహకుడు వినోద్ తెలిపారు. 34 మందితో అమర్నాథ్ యాత్రకు వెళ్లామని, అక్కడ ఒక్కసారిగా వరద రావడంతో

అమరావతి: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీ యాత్రికుల బృందం క్షేమంగా ఉందని బృంద నిర్వాహకుడు వినోద్ తెలిపారు. 34 మందితో అమర్నాథ్ యాత్రకు వెళ్లామని, అక్కడ ఒక్కసారిగా వరద రావడంతో దైవం సన్నిదానం వద్దే చెల్లాచెదురయ్యామని చెప్పారు. పోలీసుల సహకారంతో తిరిగి అందరం ఒకచోటుకు చేరామని తెలిపారు. ప్రస్తుతం జమ్మూ సమీపంలోని కాట్రా వద్దకు చేరుకున్నామని చెప్పారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నామని, తమ గురించి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని వినోద్ పేర్కొన్నారు. కాగా రేపు ఉ.8 గంటలకు చంఢీగఢ్ నుంచి విజయవాడకు ట్రైన్లో తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాజమండ్రికి చెందిన సుధా, పార్వతి ఆచూకీ లభించలేదని వెల్లడించింది.