AP News: ఆ న్యూడ్ వీడియోను నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలి: అనిత
ABN , First Publish Date - 2022-08-12T00:34:57+05:30 IST
Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupuram MP Gorantla Madhav) న్యూడ్ వీడియో (Nude Vedio) మాటల యుద్ధానికి దారితీసింది. గోరంట్ల విషయంలో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప చేసిన వ్యాఖ్యలపై టీడీపీ (TDP) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్లపై

Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupuram MP Gorantla Madhav) న్యూడ్ వీడియో (Nude Vedio) మాటల యుద్ధానికి దారితీసింది. గోరంట్ల విషయంలో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప చేసిన వ్యాఖ్యలపై టీడీపీ (TDP) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం వీలుకాదని ఎస్పీ చెప్పడంపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Anita) అసహనం వ్యక్తం చేశారు. గోరంట్ల న్యూడ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షకు పంపితే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్లపై, సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. మహిళల పట్ల వైసీపీ నేతల అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకే కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్ సర్కార్ విఫలమైందన్నారు.