సందేశాత్మకంగా నాటికలు

ABN , First Publish Date - 2022-10-04T06:15:58+05:30 IST

తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రదర్శిస్తున్న నాటికలు సమాజానికి సందేశం అందిస్తున్నాయి.

సందేశాత్మకంగా నాటికలు
మృత్యు పత్రం నాటికలోని సన్నివేశం

తెనాలి అర్బన్‌, అక్టోబరు 3: తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రదర్శిస్తున్న నాటికలు సమాజానికి సందేశం అందిస్తున్నాయి. కళల కాణాచి, వేద గంగోత్రి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటికల పోటీలు సోమవారం రాత్రి రెండు నాటికలు ప్రదర్శించారు. పిన్నమనేని మృత్యుంజయరావు రచించిన ఓ క్రైం కథ నాటికను ఆర్‌.వాసు దర్శకత్వం వహించారు. విజయవాడ యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్‌ కళాకారులు ప్రదర్శించారు. మరో నాటిక మృత్యుపత్రం ఎం.రవీంద్రబాబు రచించి, దర్శకత్వం వహించారు. చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్‌ కళాకారులు ఈ నాటిక ప్రదర్శించారు. మూడో రోజు నాటికల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో బుర్రా సాయిమాథవ్‌, షేక్‌ జానీబాషా, చెరుకుమల్లి సింగారావు, గోపరాజు విజయ్‌, రచయితలు కావూరి సత్యనారాయణ, వరికూటి శివప్రసాద్‌, బ్యాంకు ప్రసాద్‌, కొల్లి మోహనరావు, ఆకుల మల్లేశ్వరరావు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. 

మంగళవారం జరగనున్న నాటికల ముగింపు సభలో సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ పాల్గొంటారు. ఎ.ఆర్‌.కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారాన్ని ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లుకు ప్రదానం చేస్తారు. 

Read more