తెలుగుజాతి కీర్తిని నలుదిశలా చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-07-18T05:58:33+05:30 IST

తెలుగుజాతి కీర్తిని ప్రపంచం నలుమూలల చాటిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని ఎన్టీఆర్‌ ట్రస్టు డైరెక్టర్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ అన్నారు.

తెలుగుజాతి కీర్తిని నలుదిశలా చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌
టీడీపీ నాయకుడు మన్నవ మోహనకృష్ణను సత్కరిస్తున్న నిర్వాహకులు

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ

గుంటూరు(సాంస్కృతికం), జూలై 17 : తెలుగుజాతి కీర్తిని ప్రపంచం నలుమూలల చాటిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని ఎన్టీఆర్‌ ట్రస్టు డైరెక్టర్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ అన్నారు. శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘంటసాల గానగౌతమి భీమ వరం నిర్వాహకులు చిప్పాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల సందర్భంగా యుగపురుషుడికి స్వర నివాళి కార్యక్ర మం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సన్మాన గ్రహీత మన్నవ మోహన కృష్ణ తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు, బలహీనవర్గాలకు భాగస్వామ్యం కల్పించిన అభ్యుదయవాది ఎన్టీఆర్‌ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం అనుని త్యం పాటుపడిన మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడం తెలుగువారి అదృష్ట మన్నారు. సభలో కళాదర్బార్‌ వ్యవస్థాపకులు పొత్తూరి రంగారావు, తెలుగు మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలు పూల విజయలక్ష్మి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, టీఎన్‌టీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దొంతా నాగగౌడ్‌, ఎమ్మార్పీఎస్‌ నగర అధ్యక్షుడు సుంకర నాని, జిల్లా తెలుగు యువత ప్రచార కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు. 

అలరించిన సినీ సంగీత విభావరి

ఎన్టీఆర్‌ చిత్రాల గీతావళి పేరున జరిగిన సినీ సంగీత విభావరి ప్రేక్షకు లను అలరింపజేసింది. గాయనీ గాయకులు సీహెచ్‌ నాగేశ్వరరావు, తణుకు రాజు, నిర్మల, లక్ష్మీప్రసన్నలు తమ గాత్రధారణలో ఎన్టీఆర్‌ నటించిన పలు చిత్రాలలోని మధుర గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. 


Updated Date - 2022-07-18T05:58:33+05:30 IST