AP News: మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం
ABN , First Publish Date - 2022-08-18T23:14:30+05:30 IST
Vijayawada: విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) తో ఉపాధ్యాయ సంఘాల చర్చలు ముగిశాయి. గంటన్నరకుపైగా

Vijayawada: విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) తో ఉపాధ్యాయ సంఘాల చర్చలు ముగిశాయి. గంటన్నరకుపైగా సాగిన ఈ సమావేశంలో ముఖ ఆధారిత యాప్‌పై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సొంత ఫోన్లను వాడటం తమకు సాధ్యం కాదని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. సొంత ఫోన్లు వాడాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ యాప్ త్వరలో అమల్లోకి వస్తుందని బొత్స చెప్పారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు (Teachers Associations) పదిహేను రోజుల తర్వాత మళ్లీ భేటీ కావాలని నిర్ణయించుకున్నాయి. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘అన్ని ప్రభుత్వ శాఖల్లో యాప్ వినియోగంలోకి వస్తుందని మంత్రి చెప్పారు. అందరికీ సెల్ ఫోన్లు కొనివ్వాలంటే.. రూ. 200 కోట్లు ఖర్చవుతుందన్నారు. మా ఫోన్ల ద్వారానే యాప్ వాడాలని’’ చెప్పారు.