స్వచ్ఛ గుంటూరులో భాగస్వామ్యం కండి
ABN , First Publish Date - 2022-12-24T01:40:08+05:30 IST
గుంటూరు నగరాన్ని స్వచ్చ, ఆరోగ్యనగరంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలని కలెక్టరు ఎం.వేణుగోపాల్ రెడ్డి కోరారు.
గుంటూరు (కార్పొరేషన్) డిసెంబరు 23: గుంటూరు నగరాన్ని స్వచ్చ, ఆరోగ్యనగరంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలని కలెక్టరు ఎం.వేణుగోపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం గుంటూరు నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో నగరంలో 25 ప్రధాన కూడ ళ్ళలో 130 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి 50వేల మంది విద్యా ర్థులతో స్థానిక కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారుల ఆధ్వర్యంలో నగర పరిశుభ్రత, స్వచ్చతపై ర్యాలీలు, మానవహారాలు చేపట్టారు. కలెక్టరేట్ నుంచి నాజ్‌సెంటర్ వరకు జరిగిన ర్యాలీ, మానవహారం కార్యక్రమంలో కలెక్టరు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఇన్‌చార్జి కమిషనర్ పెద్ది రోజా పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడు తూ గుంటూరు నగరాన్ని దేశంలోనే స్వచ్చ నగరంగా అగ్రస్థానంలో నిలబెట్టడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, అందుకుగాను నగరపాలకసంస్థ చేపట్టే కార్యాక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాల న్నారు. విద్యార్థులు మానవహారంలో ప్లకార్డులు చేతబట్టి, నినాదాలిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకురావడం అభినందనీయ మన్నారు. మేయర్ మనోహర్‌నాయుడు మాట్లాడుతూ క్లీన్ గుంటూరు కోసం ప్రజలకు అవగాహన కల్పించడానికి నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్థ చూపుతుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజ లు భాగస్వామ్యమైతేనే స్వచ్చనగర సాధన తేలికవుతుందన్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చుకోవడమంటే ప్రజారోగ్యాన్ని మెరుగుపరుచుకోవడ మేనని, అందుకు ప్రతి ఒక్కరూ భాధ్యత తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ మాట్లాడుతూ క్లీన్ గుంటూరు ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని, అందుకు ప్రజలతో కలిసి అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలన్నారు.
నాజ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మానవహారంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ విద్యార్థులతో స్వచ్చతా ప్రతిజ్ఞ చేపించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వనమా బాలవజ్రబాబు, షేక్ సజిలా, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ. భాస్కర్, సిటిప్లానర్ మూర్తి, ఎంహెచ్‌వో డాక్టర్ భానుప్రకాష్, ఈఈ సుందరరామిరెడ్డి, మేనేజర్ శివన్నారాయణ పాల్గొన్నారు.