హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి
ABN , First Publish Date - 2022-06-29T05:56:22+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఏపీ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.

యువజన జేఏసీ ఆందోళన
పెదకాకాని, జూన్ 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఏపీ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు మరో 30 ఏళ్లు పడుతుందన్నారు. అప్పటి వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరారు. దీనిపై జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన, ఆందోళనలు చేపడతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో దళిత బహుజన జాగృతి అధ్యక్షులు కొమ్ము రాజీవ్‌కుమార్, శివగణేష్, నంబూరు నాని, అశోక్‌కుమార్, అరుణ్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.