పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది

ABN , First Publish Date - 2022-12-16T00:49:14+05:30 IST

ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.

పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది
పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని, పార్టీ శ్రేణులు

పిడుగురాళ్ల, డిసెంబరు 15: ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. గురువారం పొట్టి శ్రీరాములు 70వ వర్థంతిని పురస్కరించుకొని పట్టణ టీడీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యరపతినేని మాట్లాడుతూ తెలుగువారి ఐక్యతకు పొట్టి శ్రీరాములు, ఎన్టీరామారావు చేసిన సేవలను గుర్తుచేశారు.

కార్యక్రమంలో కనిగిరి శ్రీను, వందనపు కోటి, కోట హరి, పాండురంగ శ్రీను, నీరుమళ్ల శ్రీను, తురకా వీరస్వామి, గండికోట వెంకటేశ్వర్లు, రమేష్‌, కొమ్మినేని రామచంద్రరావు, దియ్యా రామకృష్ణ, సయ్యద్‌ అమీర్‌ఆలి, ఫణితి రవి, వల్లెపు రామకృష్ణతోపాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:49:18+05:30 IST