జనసమీకరణ కోసం డ్వాక్రా గ్రూపులా?.. సోము వీర్రాజు
ABN , First Publish Date - 2022-05-29T00:38:51+05:30 IST
అధికార పార్టీ సభలకు డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులను వాడుకోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు. అలా వారిని ఆహ్వానించవచ్చని రాష్ట్ర

Amaravathi: అధికార పార్టీ సభలకు డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులను వాడుకోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు. అలా వారిని ఆహ్వానించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అధికారిక ఉత్తర్వులు ఇచ్చిందా? అని ఏపీ చీఫ్ సెక్రటరీకి సోము వీర్రాజు లేఖ రాశారు. జనసమీకరణకు డ్వాక్రా గ్రూపులను వాడుకోవడం సరికాదన్నారు. డ్వాక్రా సంఘాలను భయపెట్టి సమావేశాలకు తీసుకురావడం పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలను ఆహ్వానించే అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.