సంపూర్ణ ఆరోగ్యానికి విప్లవాత్మక పథకాలు
ABN , First Publish Date - 2022-12-15T00:59:40+05:30 IST
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీ.ఉషశ్రీచరణ్ అన్నారు.
గుంటూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీ.ఉషశ్రీచరణ్ అన్నారు. బుధవారం గుంటూరులోని జడ్పీ సమావేశ మందిరంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల జోనల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సంచాలకులు శైలజ జోనల్పరిధిలో అమలవుతున్న కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా మంత్రికి వివ రించారు. మంత్రి ఉషశ్రీచరణ్ జిల్లాలవారీగా అందుతున్న పథకాల వినియోగం గురించి పీడీలు, సీడీపీవోలను అడిగి తెలుసుకొన్నారు. నాడు-నేడు ద్వారా అంగన్వాడి కేంద్రాలు, స్కూళ్లను పూర్తిస్థాయి మౌలిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు. తొలుత జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టీనా మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతించారు. అనంతరం మహిళా ప్రాంగణంలో నిర్మించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ని మంత్రి పరిశీలించారు. సమావేశంలో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శైలజ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల ఐసీడీఎస్ అధికారులు మనోరం జని, అరుణ, ధనలక్ష్మి, ఉమ,సౌజన్య, సీడీపీవోలు పాల్గొన్నారు.