సాగర్‌ ఆరు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

ABN , First Publish Date - 2022-09-19T06:01:40+05:30 IST

నాగార్జున సాగర్‌ ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్‌ ఆరు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

సాగర్‌ ఆరు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

విజయపురిసౌత, సెప్టెంబరు 18: నాగార్జున సాగర్‌ ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్‌ ఆరు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. కాగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం ఆదివారం నాటికి 588.20 అడుగులు ఉంది. ఇది 306.69 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 9500, ప్రధాన జలవిద్యుత కేంద్రం ద్వారా 33,962, వరద కాలువ ద్వారా 400, 66 క్రస్ట్‌గేట్లను 10 అడుగులు ఎత్తి 57,936, మొత్తం ఔట్‌ఫ్లోగా 1,34,178 క్యూసెక్కులు విడుదలచేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇనఫ్లో 1,34,178 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.40 అడుగులు ఉంది. ఇది 212.43 టీఎంసీలకు సమానం. శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 1,92,047, రోజా నుంచి 34,216, మొత్తంగా 2,26,263 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 


పులిచింతలకు 1,24,680 క్యూసెక్కులు..


రెంటచింతల,సెప్టెంబరు18: సత్రశాలలోని కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ప్రాజెక్టు నుంచి పులిచింతలకు 1,24,680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్‌ఈ పాలుగుళ్ల శ్రీరామిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ప్రాజెక్టు 20 క్రస్ట్‌గేట్లకు గాను ఆరు గేట్లను 4 మీటర్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.  నాగార్జునసాగర్‌ నుంచి 1,51,108 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరుతుందని, ప్రస్తుతం రిజర్వాయర్‌లో 6.481 టీఎంసీల నీరుండగా  అది 74.61 మీటర్లకు అంటే 244.78 అడుగులకు సమానమని పేర్కొ న్నారు. విద్యుదుత్పత్తి జరగడం లేదని తెలిపారు.


Read more