నాట్కో సేవలు ప్రశంసనీయం

ABN , First Publish Date - 2022-12-13T01:14:41+05:30 IST

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ రూపాల్లో ఇప్పటివరకు రూ.100 కోట్ల వరకు విరాళాలుగా అందజేసిన నాట్కో సంస్థ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు.

నాట్కో సేవలు ప్రశంసనీయం
మెమోగ్రాఫీ పరికరాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని

గుంటూరు(జీజీహెచ్‌), డిసెంబరు12: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ రూపాల్లో ఇప్పటివరకు రూ.100 కోట్ల వరకు విరాళాలుగా అందజేసిన నాట్కో సంస్థ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు. సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని నాట్కో కేంద్రంలో గడ్డిపాటి కస్తూరిదేవి, రామ్మోహనరావు, శివరామకృష్ణల సౌజన్యంతో సుమారు కోటి విలువ గల డిజిటల్‌ మెమోగ్రఫీ పరికరాన్ని ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలోని క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో ఈ పరికరాన్ని ఏర్పాటు చేయడం గుంటూరులోనే తొలిసారి అన్నారు. రాష్ట్రంలో ఏటా 60వేల క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి అన్నారు. కడప, కర్నూలు జిల్లాల్లో కేన్సర్‌ ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు. విశాఖలో హోమిబాబా ఆసుపత్రిలో కేన్సర్‌ చికిత్సకు ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. బొంగరాలబీడులోని కార్మికశాఖకు చెందిన స్థలం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. చంద్రబాబు పాలనలోని వైద్యరంగం ఘోరంగా దెబ్బతిందన్నారు. మెమోగ్రాఫీ పరికరం వలన ముఖ్యంగా మహిళలలో రొమ్ము కేన్సర్‌ను త్వరగా గుర్తించే వీలుందని నాట్కో ట్రస్టీ స్వాతి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళిగిరి, ఉండవల్లి శ్రీదేవి, ప్రఽభుత్వ కార్యదర్శి నవీన్‌ కుమార్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:14:41+05:30 IST

Read more