అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్‌ !

ABN , First Publish Date - 2022-10-07T06:03:44+05:30 IST

అమరావతి రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న పోరాటంపై అధికారపార్టీ నేతలు అధికార మదంతో అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని, రైతుల త్యాగాలను హేళన చేస్తే ఖబడ్దార్‌ అని అమరావతి రాజధానికి భూములు త్యాగంచేసిన రైతులు హెచ్చరిం చారు.

అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్‌ !

 రాజధానికి భూములిచ్చిప రైతులు, మహిళలు

1024వ రోజుకు అరావతి రాజధాని ఆందోళనలు, దీక్షలు


తుళ్లూరు, అక్టోబరు6: అమరావతి రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న పోరాటంపై అధికారపార్టీ నేతలు అధికార మదంతో అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని, రైతుల త్యాగాలను హేళన చేస్తే ఖబడ్దార్‌ అని అమరావతి రాజధానికి భూములు త్యాగంచేసిన రైతులు హెచ్చరిం చారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారం నాటికి 1024వ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ రాజధాని రైతులు ఒళ్లు బలిసి పాదయ్రాతలు చేస్తున్నారని వైసీపీ మంత్రులు మాట్లాడటం వారి అధికార మదాన్ని వెల్లడిచేస్తుంద న్నారు. మూడు రాజధానులొద్దని, అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని ఐదు కోట్ల మంది  చెపుతుంటే కాదని  మూడు ముక్కల రాజధానులను రాష్ట్ర ప్రజలపై జగన్‌రెడ్డి రుద్దుతున్నాడని అన్నారు. అమరావతి రాజధాని రాష్ట్రానికి కేంద్ర బిందువగా, అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే నగరమన్నారు. రాజధాని అభివృద్ధికి కావాల్సిన సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయన్నారు. విశాఖలో పాలకులకు ఉన్న వేల ఎకరాల భూముల విలువ పెంచుకోవటానికి అమరావతిని కాదంటున్నారని ఆరోపించారు. కేవలం వారి రాజకీయ, ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయటం లేదంటే ఎంత అహంకారంతో పాలకులున్నారో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. అమరావతి ఆవశ్యకత  చెప్పటంకోసం పాద యాత్రచేస్తుంటే అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. అమరావతి ఉద్యమం అహింసా మార్గమని స్పష్టంచేశారు. అధికారానికి ముందు అమరావతి స్వాగతిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్‌  అధికారం వచ్చాక మాట తప్పి.. మడమ తిప్పి.. మూడు ముక్కల ఆటకు తెరతీశారన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు.

Updated Date - 2022-10-07T06:03:44+05:30 IST