సౌత్‌జోన్‌ పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

ABN , First Publish Date - 2022-05-16T05:29:37+05:30 IST

అనకాపల్లి పట్టణంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగే సబ్‌ జూనియర్స్‌, సీనియర్స్‌ సౌత్‌జోన్‌ పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో గుంటూరు జిల్లా నుంచి పాల్గొనే మెన్‌ అండ్‌ ఉమెన్‌ క్రీడాకారుల వివరాలను అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు వెల్లడించారు.

సౌత్‌జోన్‌ పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
సౌత్‌జోన్‌ పవర్‌లిఫ్టింగ్‌ పోటీలలో పాల్గొనే జిల్లా జట్టు సభ్యులు

మంగళగిరి, మే15: అనకాపల్లి పట్టణంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగే సబ్‌ జూనియర్స్‌, సీనియర్స్‌ సౌత్‌జోన్‌ పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో గుంటూరు జిల్లా నుంచి పాల్గొనే మెన్‌ అండ్‌ ఉమెన్‌ క్రీడాకారుల వివరాలను అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు వెల్లడించారు. పురుషుల విభాగంలో 59 కేజీల జూనియర్స్‌లో సీహెచ్‌ నవీన్‌, సీనియర్స్‌లో సీహెచ్‌ రమేష్‌, 83 కేజీల సబ్‌ జూనియర్స్‌లో బి.మోహనసాయి, రామకృష్ణ, 93 కేజీల సబ్‌ జూనియర్స్‌లో షేక్‌ ఇర్ఫాన్‌ పోటీ చేస్తారన్నారు. మహిళల విభాగంలో 47 కేజీల జూనియర్స్‌లో ఎం.అనూష, 57 కేజీల జూనియర్స్‌లో షేక్‌ సాదియా అల్మాస్‌, 63 కేజీల జూనియర్స్‌లో షేక్‌ ఆసియా, 84 కేజీల సబ్‌ జూనియర్స్‌లో షేక్‌ సబీనా, ఎన్‌.జ్జానదివ్య, 88 కేజీల సీనియర్స్‌లో బి.చంద్రిక పోటీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు షేక్‌ సంధాని, సయ్యద్‌ మస్తాన్‌వలి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-16T05:29:37+05:30 IST