నవ్యాంధ్ర ద్రోహి.. ప్రధాని మోదీ గో బ్యాక్‌..

ABN , First Publish Date - 2022-11-12T00:59:30+05:30 IST

విభజన హామీలు అమలు చేయకుండా నవ్యాంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసిన ప్రధాని నరేంద్రమోదీ గోబ్యాక్‌.. అంటూ కాంగ్రెస్‌ నేతలు నిరసన తెలియజేశారు.

నవ్యాంధ్ర ద్రోహి.. ప్రధాని మోదీ గో బ్యాక్‌..
నల్లజెండాలతో నిరసన తెలియజేస్తున్న మస్తాన్‌వలి, లింగంశెట్టి తదితరులు

రాష్ట్రాన్ని మోసం చేస్తున్న ఇద్దరు తోడు దొంగలు

బీజేపీకి బానిసలా వ్యవహరిస్తున్న జగన్‌

కాంగ్రెస్‌ నేతలు.. నల్ల జెండాలతో నిరసన

గుంటూరు, నవంబరు 11: విభజన హామీలు అమలు చేయకుండా నవ్యాంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసిన ప్రధాని నరేంద్రమోదీ గోబ్యాక్‌.. అంటూ కాంగ్రెస్‌ నేతలు నిరసన తెలియజేశారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా గోబ్యాక్‌ మోదీ అంటూ ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు షేక్‌ ఉస్మాన్‌ ఇతర నాయకులు రాజీవ్‌ గాంధీ భవన్‌ ఆవరణలో నల్ల జెండాలతో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా

మస్తాన్‌వలి మాట్లాడుతూ నవ్యాంధ్రకు నీరు, మట్టితో సరిపెట్టి విభజన హామీలను గాలికొదిలేసిన ప్రధాని మోదీని విశాఖ సభలో సీఎం జగన్‌ నిలదీయాలన్నారు. లేకుంటే ఇద్దరు తోడుదొంగలు ప్రజల్ని మోసం చేస్తున్నట్టేనని ధ్వజమెత్తారు. లింగంశెట్టి మాట్లాడుతూ సీఎం జగన్‌ స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడు తున్నారని విమర్శించారు. తన తండ్రి పేరు చెప్పుకొని కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రధాని మోదీకి బానిసలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిరసనలో కాంగ్రెస్‌ నాయకులు అంబటి రత్తయ్య, జక్కా శ్రీనివాస్‌,

జొన్నల వెంకటరెడ్డి, జానీ, బాబు, ఇస్మాయిల్‌, మోషే, శ్రీను, పాల్‌విజయ్‌కుమార్‌ తదితరులున్నారు.

పోలీసుల అభ్యంతరం.. విఫలయత్నం ..

కాంగ్రెస్‌ నేతలు నల్లజెండాలు, నినాదాలు చేస్తుండటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీభవన్‌కు చేరుకొని నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు. సీఎం పర్యటన ముగిసే వరకు కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట పోలీసు పహారా సాగింది.

వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో..

గుంటూరు(తూర్పు): విశాఖ ఉక్కును ప్రభుత్వమే నిర్వహించేలా ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ గోబ్యాక్‌ అంటూ శుక్రవారం శంకర్‌ విలాస్‌ సెంటర్లో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో వై.రాధాకృష్ణమూర్తి, నేతాజీ, నాగేశ్వరరావు, హనుమంతురావు, ముత్యాలరావు పాల్గొన్నారు.

కార్మికుల ముందస్తు అరెస్టులు హేయం..

11బిఎన్‌ఆర్‌ 2 నల్లజెండాలతో నిరసన తెలియజేస్తున్న మస్తాన్‌వలి, లింగంశెట్టి తదితరులు

నవ్యాంధ్ర ద్రోహి.. ప్రధాని మోదీ గో బ్యాక్‌..

రాష్ట్రాన్ని మోసం చేస్తున్న ఇద్దరు తోడు దొంగలు

బీజేపీకి బానిసలా వ్యవహరిస్తున్న జగన్‌

కాంగ్రెస్‌ నేతలు.. నల్ల జెండాలతో నిరసన

గుంటూరు, నవంబరు 11: విభజన హామీలు అమలు చేయకుండా నవ్యాంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసిన ప్రధాని నరేంద్రమోదీ గోబ్యాక్‌.. అంటూ కాంగ్రెస్‌ నేతలు నిరసన తెలియజేశారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా గోబ్యాక్‌ మోదీ అంటూ ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు షేక్‌ ఉస్మాన్‌ ఇతర నాయకులు రాజీవ్‌ గాంధీ భవన్‌ ఆవరణలో నల్ల జెండాలతో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మస్తాన్‌వలి మాట్లాడుతూ నవ్యాంధ్రకు నీరు, మట్టితో సరిపెట్టి విభజన హామీలను గాలికొదిలేసిన ప్రధాని మోదీని విశాఖ సభలో సీఎం జగన్‌ నిలదీయాలన్నారు. లేకుంటే ఇద్దరు తోడుదొంగలు ప్రజల్ని మోసం చేస్తున్నట్టేనని ధ్వజమెత్తారు. లింగంశెట్టి మాట్లాడుతూ సీఎం జగన్‌ స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడు తున్నారని విమర్శించారు. తన తండ్రి పేరు చెప్పుకొని కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రధాని మోదీకి బానిసలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిరసనలో కాంగ్రెస్‌ నాయకులు అంబటి రత్తయ్య, జక్కా శ్రీనివాస్‌, జొన్నల వెంకటరెడ్డి, జానీ, బాబు, ఇస్మాయిల్‌, మోషే, శ్రీను, పాల్‌విజయ్‌కుమార్‌ తదితరులున్నారు.

  • పోలీసుల అభ్యంతరం.. విఫలయత్నం ..

    కాంగ్రెస్‌ నేతలు నల్లజెండాలు, నినాదాలు చేస్తుండటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీభవన్‌కు చేరుకొని నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు. సీఎం పర్యటన ముగిసే వరకు కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట పోలీసు పహారా సాగింది.

  • వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో..

    విశాఖ ఉక్కును ప్రభుత్వమే నిర్వహించేలా ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ గోబ్యాక్‌ అంటూ శుక్రవారం శంకర్‌ విలాస్‌ సెంటర్లో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో వై.రాధాకృష్ణమూర్తి, నేతాజీ, నాగేశ్వరరావు, హనుమంతురావు, ముత్యాలరావు పాల్గొన్నారు.

  • కార్మికుల ముందస్తు అరెస్టులు హేయం..

    విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ పోరాడుతున్న కార్మికులను ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేయటాన్ని టీడీపీ కార్మిక అనుబంధ విభాగం టీఎన్‌టీ యూసీ నేతలు గుంటుపల్లి శేషగిరిరావు, నారా జోషి, వేముల సుబ్బారావు, మద మంచి శ్రీనివాస్‌లు ఒక ప్రకటనలో ఖండించారు.

  • విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ పోరాడుతున్న కార్మికులను ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేయటాన్ని టీడీపీ కార్మిక అనుబంధ విభాగం టీఎన్‌టీ యూసీ నేతలు గుంటుపల్లి శేషగిరిరావు, నారా జోషి, వేముల సుబ్బారావు, మద మంచి శ్రీనివాస్‌లు ఒక ప్రకటనలో ఖండించారు.

Updated Date - 2022-11-12T00:59:34+05:30 IST