ఎండు మిర్చి లోడు లారీ అపహరణ
ABN , First Publish Date - 2022-10-07T06:01:14+05:30 IST
టోనగర్ వద్ద ఎండుమిర్చి లోడుతో ఆగివున్న లారీని అపహరించిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ డీఎస్పీ జె.రాంబాబు తెలిపారు.
జీపీఎస్ ద్వారా మూర్జాపురం వద్ద లారిని ఆచూకీ గుర్తింపు
నలుగురు నిందితుల అరెస్టు పోలీసులు
పెదకాకాని, అక్టోబరు 6: ఆటోనగర్ వద్ద ఎండుమిర్చి లోడుతో ఆగివున్న లారీని అపహరించిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ డీఎస్పీ జె.రాంబాబు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ పెదకాకాని అంబేద్కర్ నగర్‌కు చెందిన సోమవారపు రవి, కాకాని రోడ్డు మద్దిరాల కాలనీ చెందిన షేక్ మస్తాన్, షేక్ గౌస్ బాషా, షేక్ జాన్ సైదా, పల్నాడుజిల్లా నూజెండ్ల మండలం మూర్జాపురంకు చెందిన ఆవుల మంద నాగేశ్వరరావులు దుర్వ్యసనాలకు బానిసలయ్యారు. వీరిలో ఇద్దరు వ్యాపారం చేసి నష్టపోగా, మరో ముగ్గురు అక్రమంగా డబ్బు సంపాదించి జల్సా చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆటోనగర్‌లోని బందరు రోడ్డులో లోడ్ చేసి ఉన్న మిర్చి లారీని ఎంచుకున్నారు. ఈనెల 2న అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఎండు మిర్చి లారీని ఒక పథకం ప్రకారం అపహరించారు. నేరుగా లారీని పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం మూర్జాపురం తీసుకెళ్లి అక్కడ లారీలోని ఎండు మిర్చిని మరో లారీలోకి లోడు చేస్తున్నారు. లారీకి అమర్చివున్న జీపీఎస్ ద్వారా లారీ ఆచూకి తెలుసు కున్న పెదకాకాని పోలీసులు మిర్చి లారీని, నిందితులు ఐదుగురిని అదుపు లోకి తీసుకొని పెదకాకాని పోలీస్ ేస్టషన్ తరలించారు. ఈమేరకు నిందితు లపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సదర్భంగా పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.