నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-10-08T05:29:57+05:30 IST

పేదలందరికీ ఇళ్ల పఽథకంలో జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ శివశంకర్‌ గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.

నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
ఉప్పలపాడు వద్ద జగనన్న కాలనీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ శివశంకర్‌

ఉప్పలపాడు జగనన్నకాలనీలో కలెక్టర్‌ శివశంకర్‌

నరసరావుపేట రూరల్‌, అక్టోబరు 7: పేదలందరికీ ఇళ్ల పఽథకంలో జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ శివశంకర్‌ గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. మండలంలోని ఉప్పలపాడు వద్ద జగనన్న కాలనీలో నిర్మిస్తున్న గృహాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ లేఅవట్‌కు సంబంధించిన సమస్యలు, అవసరమైన ఇసుక, ఇటుకలు, సిమెంటు తదితర అంశాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంజనీరు అసిస్టెంట్‌ 250 మంది లబ్ధిదారుల వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి వారం వారి  వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు మరింత అవగాహన కల్పించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణశాఖ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌. శివప్రసాద్‌, ఆర్డీవో శేషిరెడ్డి, గృహనిర్మాణ శాఖ డైరెక్టర్‌ వేణుగోపాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌, అధికారులు పాల్గొన్నారు.


Read more