Pawan Kalyan: కేసులకు భయపడాల్సిన అవసరం లేదు
ABN , First Publish Date - 2022-10-17T22:56:27+05:30 IST
Amaravathi: కేసులకు భయపడాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. విశాఖలో పోలీసులు అరెస్టు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు జనసేన లీగల్ టీం అండగా ఉంటుందన్నారు. ప్రాథమిక హక్కులకు పోలీసులు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనసేనానులు బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. న్యాయపర అంశాల్లో జనసేన శ్రేణులను చైతన్యపరుస్తామని
Amaravathi: కేసులకు భయపడాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. విశాఖలో పోలీసులు అరెస్టు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు జనసేన లీగల్ టీం అండగా ఉంటుందన్నారు. ప్రాథమిక హక్కులకు పోలీసులు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనసేనానులు బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. న్యాయపర అంశాల్లో జనసేన శ్రేణులను చైతన్యపరుస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మరింత బలంగా గొంతు వినిపించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే కాలరాస్తే న్యాయపరంగా ఎదుర్కోడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.