నిర్దేశిత గడువులో రీసర్వే పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-12-10T01:45:58+05:30 IST

జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రి య నిర్దేశిత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరు వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు.

నిర్దేశిత గడువులో రీసర్వే పూర్తిచేయాలి
మాట్లాడుతున్న కలెక్టరు వేణుగోపాలరెడ్డి, జేసీ, తెనాలి సబ్‌ కలెక్టరు

గుంటూరు(తూర్పు), డిసెంబరు 9: జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రి య నిర్దేశిత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరు వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం క్షేత్రస్థాయిలో భూరికార్డులు స్వచ్ఛీ కరణపై శుక్రవారం కలెక్టరేట్‌లోని శంకరన్‌ సమావేశ మందిరంలో రెవె న్యూ, సర్వే అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టరు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో భూరికార్డులు సక్రమంగా నిర్వహించటం ద్వారా రీసర్వే ప్రక్రియను గడువులోపు పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. రీసర్వే కంటే ముందు భూరికార్డుల స్వచ్ఛీ కరణ ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు తహసీల్దారు దృష్టికి తీసుకురా వాలని, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే రెవెన్యూ డివిజన్‌, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే రాష్ట్రస్థాయి వరకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోంటామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను ప్రతిరోజు జేసీ నివేదించాలని స్పష్టం చేశారు. మండాస్‌ తుపాను ప్రభావం ప్రస్తుతం జిల్లాపై పెద్దగా లేనప్పటికి గ్రామాల్లో రెవెన్యూ అధికారులు అప్రమ త్తంగా ఉండాలని, రైతులకు అవసరమైన సాయం అందించేందుకు వ్యవసాయ అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు.

జేసీ రాజకుమారి మాట్లాడుతూ భూరికార్డులు స్వచ్ఛీకరణ లేకపోవ డంతో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద రీసర్వే చేసిన గ్రామాల్లో అనేక తప్పిదా లను గుర్తించండం జరిగిందని, అటువంటివి పునరావృతంగాకుండా ఎఫ్‌పీవోఎల్‌ఆర్‌ సక్రమంగా నిర్వహించాలన్నారు. అంతకుముందు భూ రికార్డుల స్వచ్ఛీకరణ విధానం, మార్గదర్శకాలపై ఆర్డీవో ప్రభాకరరెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు లలిత, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ రూపానాయక్‌, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

గుడ్‌ గవర్నెన్స్‌పై 19 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు

ప్రజా సమస్యలకు పరిష్కారం, అభివృద్ధి, సేవలను ప్రజలకు అంద జేయుట, రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పాలుపంచుకోవడం వంటి కార్యక్ర మాల్లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గుడ్‌గవర్నెస్‌పై ఈ నెల 19 నుంచి 24వతేది వరకు జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఐటీ, ఈఅండ్‌సీ) కలెక్టరును ఆదేశించారు. ‘సుశాన్‌ సప్తహొ ప్రహశన్‌ గావోమ్‌ కి ఔరా 2022’ కార్యక్రమంపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా కలెక్టరు కార్యాలయం నుంచి కలెక్టరు వేణుగోపాలరెడ్డి, డీఆర్వో చంద్ర శేఖరరావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శివనారాయణశర్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:46:01+05:30 IST