యువతకు స్పూర్తిప్రధాత స్వామి వివేకానంద

ABN , First Publish Date - 2022-01-13T06:28:08+05:30 IST

దేశ సంస్కృతి, సంప్రదాయాల్ని చికాగో సభలో చాటి ప్రపంచానికి భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసిన ఘనంగ స్వామి వివేకానందుడిదని, ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శనీయమని యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

యువతకు స్పూర్తిప్రధాత స్వామి వివేకానంద
మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

యువజనసంక్షేమశాఖ మంత్రిముత్తంశెట్టి శ్రీనివాసరావు

గుంటూరు(విద్య),జనవరి 12: దేశ సంస్కృతి, సంప్రదాయాల్ని చికాగో సభలో చాటి ప్రపంచానికి భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసిన ఘనంగ స్వామి వివేకానందుడిదని, ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శనీయమని యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం  కలెక్టర్‌ బంగ్లా రోడ్డులోని స్వశక్తిభవన్‌లో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. జాతీయ యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించాలని భావించిన కోవిడ్‌ దృష్ట్యా నిర్వహించలేకపోతున్నట్లు తెలిపారు. యువతను జాగృత పరిచిన నిజనమైన హీరో స్వామి వివేకానందుడని పేర్కొన్నారు. కుల,మత, ప్రాంతీయతలకు అతీతంగా ఆయన ప్రజాభిమానం పొందారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న  హోమ్‌ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ వివేకానందుడి వంటి మహానీయుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన సర్వీసులశాఖ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాగరాణి, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, సంయుక్త కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, అనుపమ ఆంజలి, తెనాలి సబ్‌కలెక్టర్‌ డాక్టర్‌ నిఽధిమీనా, ఎమ్మెల్సీ లేళ్ళఅప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, విడదత రజని, ఉండవల్లి శ్రీదేవి, స్టెప్‌ సీఈవో డాక్టర్‌ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-13T06:28:08+05:30 IST