మండి లేబర్‌ ఛార్జీలు క్వింటాల్‌కు రూ.22

ABN , First Publish Date - 2022-12-15T03:07:50+05:30 IST

పౌరసరఫరాలశాఖ నిర్వహిస్తున్న గొడౌన్ల వద్ద ఎగుమతి, దిగుమతులు చేసే కార్మికులకు (మండి లేబర్‌)కు చెల్లిస్తున్న ఛార్జీలను క్వింటాలుకు రూ.22లుగా నిర్ణయించినట్లు సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు.

మండి లేబర్‌ ఛార్జీలు క్వింటాల్‌కు రూ.22

అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాలశాఖ నిర్వహిస్తున్న గొడౌన్ల వద్ద ఎగుమతి, దిగుమతులు చేసే కార్మికులకు (మండి లేబర్‌)కు చెల్లిస్తున్న ఛార్జీలను క్వింటాలుకు రూ.22లుగా నిర్ణయించినట్లు సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఎఫ్‌సీఐ నిర్ణయించిన షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్స్‌ ఆధారంగా స్టేట్‌ లెవెల్‌ కమిటీ స్థిరీకరించిన ఈ ధరలు మూడు సంవత్సరాల (2024-25) వరకు వర్తిస్తాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ గెజిట్‌లో పొందుపరిచారు.

Updated Date - 2022-12-15T03:07:51+05:30 IST