Amaravathi: ఆ అధికారుల నియామకం నిబంధనలకు విరుద్ధం: AP సచివాలయ ఉద్యోగుల సంఘం
ABN , First Publish Date - 2022-05-18T19:27:00+05:30 IST
ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీ క్యాడర్ కింద (Contract) కాంట్రాక్ట్ పద్ధతిలో ఐదుగురు అధికారుల నియామకానికి ఇటీవల నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే ఇది సచివాలయ ఉద్యోగుల సర్వీసు

Amaravathi : ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీ క్యాడర్ కింద (Contract) కాంట్రాక్ట్ పద్ధతిలో ఐదుగురు అధికారుల నియామకానికి ఇటీవల నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే ఇది సచివాలయ ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు విరుద్దంగా ఉందని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసింది. ఈ పోస్టులకు నెలకు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల రూపాయలు జీతం చెల్లిస్తూ.. మూడేళ్ల ఉద్యోగ కాలం ఇవ్వడం సమంజసం కాదని లేఖలో పేర్కొన్నారు. వీరి నియామక హోదాలను ఓఎస్డీ లేదా కన్సల్టెంట్ లేదా ఎక్స్పర్ట్గా మార్చాలని కోరారు.