కృష్ణానదిలో గల్లంతై వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-10-07T06:05:41+05:30 IST
మండలంలోని మాదిపాడు గ్రామంలో బతుకమ్మ నిమజ్జన సందర్భంగా పరిమి నరసింహారావు(38) అనే వ్యక్తి గురువారం కృష్ణానదిలో గల్లంతై మృతిచెందాడు.
అచ్చంపేట, అక్టోబరు 6: మండలంలోని మాదిపాడు గ్రామంలో బతుకమ్మ నిమజ్జన సందర్భంగా పరిమి నరసింహారావు(38) అనే వ్యక్తి గురువారం కృష్ణానదిలో గల్లంతై మృతిచెందాడు. విజయదశమి సందర్భంగా బతుకమ్మను కృష్ణానదిలో నిమజ్జనం చేసే క్రమంలో మాదిపాడు వద్ద పుష్కర ఘాట్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. బతకమ్మను నదిలో వదిలి తిరిగి వచ్చే క్రమంలో నరసింహారావు కాలు జారి నదిలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు గాలించి నరసింహారావు మృతదేహాన్ని వెలికితీశారు. నరసింహారావుకు భార్య శైలజ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అచ్చంపేట ఎస్‌ఐ రవీంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.