ఎమ్మెల్యే శ్రీదేవి తీరుతో పార్టీకి నష్టం

ABN , First Publish Date - 2022-03-21T06:01:21+05:30 IST

తాడికొండ మండలంలో వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ దెబ్బతినకుండా ఉండటానికే నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీపీ కొమ్మినేని రామచంద్రరావు అన్నారు.

ఎమ్మెల్యే శ్రీదేవి తీరుతో పార్టీకి నష్టం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీపీ కొమ్మినేని రామచంద్రరావు

కార్యకర్తలకు అండగా కమిటీ ఏర్పాటు 

ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు

తాడికొండ, మార్చి 20: తాడికొండ మండలంలో వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ దెబ్బతినకుండా ఉండటానికే నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీపీ కొమ్మినేని రామచంద్రరావు అన్నారు. ఆదివారం రాత్రి తాడికొండలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యతిరేక వర్గీయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పనితీరు వలన వైసీపీ కార్యకర్తలు నష్టపోవటమే కాకుండా పార్టీ దెబ్బతింటుందని పేర్కొన్నారు. పార్టీ నష్టపోకుండా, కార్యకర్తలకు అండగా ఉంటానికి వైసీపీ తాడికొండ మండల కార్యకర్తల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 45 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం  ఉదయం  కంతేరు గ్రామంలో పర్యటిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే  శ్రీదేవి తన తీరు మార్చుకోకపోతే తదుపరి కార్యచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండ్ల పున్నారావు, సర్పంచలు ముప్పాళ్ల మనోహర్‌, బిక్కి శివరామకృష్ణ, మాజీ సర్పంచ తుమ్మల రామస్వామిరెడ్డి, నాయకులు తోకల నరసింహారావు, పసుపులేటి వెంకట్రావు, బొర్రా వెంకటేశ్వరరెడ్డి, వంగా పోలారెడ్డి, షేక్‌ మొయినుద్దీన, వడ్లమూడి రాజేంద్ర, బాకీ వెంకటస్వామి, మీర్జావలి, పలురువు ఎంపీటీసీలు, సర్పంచలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-03-21T06:01:21+05:30 IST