జాబ్‌ చార్ట్‌ ప్రకారం విధులు నిర్వహించేలా చూడాలి

ABN , First Publish Date - 2022-12-15T00:47:48+05:30 IST

సచివాల య ఉద్యోగులు జాబ్‌ చార్ట్‌ ప్రకారం విధులు నిర్వహిం చేలా లైన్‌ డిపార్టుమెంట్ల అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు.

జాబ్‌ చార్ట్‌ ప్రకారం విధులు నిర్వహించేలా చూడాలి

గుంటూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సచివాల య ఉద్యోగులు జాబ్‌ చార్ట్‌ ప్రకారం విధులు నిర్వహిం చేలా లైన్‌ డిపార్టుమెంట్ల అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన తన కార్యాలయం నుంచి వెబ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా, మండలస్థాయి అధికారులతో మాట్లాడారు. సచివాలయాల ఉద్యోగులకు సంబందించి ఆన్‌లైన్‌ హాజరుని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలకు సిఫార్సు చేయాలన్నారు. గడప గడపకు మన ప్రభు త్వం కార్యక్రమంలో కొత్తగా అందిన ప్రాధాన్య పనులకు సంబంఽధించి పరి పాలన మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ఇప్పటికే మంజూ రు చేసిన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పురోగతి ఆశించిన మేరకు లేదని, ప్రణాళికాబద్ధంగా అధికారులు పని చేసి పనులు వేగవంతం చేయాలన్నారు. ఇందుకు సచివాలయాల సిబ్బంది సహకారాన్ని తీసుకోవాలని సూ చించారు. ప్రభుత్వ ప్రాధాన్య భవనాలైన ఆర్‌బీకేలు, సచి వాలయాల భవనలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీలు వేగవంతం చేయాలన్నారు. ధాన్య కొనుగోళ్లల సాఫీగా జరిగేలా వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ, మార్కెటింగ్‌ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ సమా వేశానికి కలెక్టరేట్‌ నుంచి జేసీ రాజకుమారి, జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి, సీపీవో శేషశ్రి, వ్యవసాయశాఖ జేడీ నున్న వెంకటేశ్వర్లు, సచివాలయాల నోడల్‌ అధికారి మోహన్‌రావు, హౌసింగ్‌ పీడీ సాయి నాథ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:47:51+05:30 IST