ధాన్యం తేమ శాతంపై ఆందోళన చెందవద్దు

ABN , First Publish Date - 2022-12-15T00:51:02+05:30 IST

ధాన్యం తేమ శాతంపై రైతులు ఆందోళన చెందవద్దని, ఆర్‌బీకే కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి హామీ ఇచ్చారు. చేబ్రోలులో బుధవారం జేసీ రాజకుమారి పర్యటించారు.

ధాన్యం తేమ శాతంపై ఆందోళన చెందవద్దు
రైతులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి

చేబ్రోలు, డిసెంబరు 14 : ధాన్యం తేమ శాతంపై రైతులు ఆందోళన చెందవద్దని, ఆర్‌బీకే కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి హామీ ఇచ్చారు. చేబ్రోలులో బుధవారం జేసీ రాజకుమారి పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. షేక్‌ మస్తాన్‌ అనే రైతు వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు రూ.96 లక్షలు విలువ కలిగిన 487 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రూ.86 లక్షలు రైతు ఖాతాలకు జమ చేసి చెల్లించామన్నారు. రైస్‌ మిల్లర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియను సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా 9491392717 కంట్రోల్‌ రూమ్‌ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్‌.వెంకటేశ్వరరావు, పౌర సరఫరాలశాఖ మేనేజర్‌ జి.లక్ష్మి, చేబ్రోలు తహసీల్దారు సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:51:05+05:30 IST